రక్షకుడు యేసు రక్షకుడు, Rakshakudu yesu rakshakudu

by JP Gospel Melodies




ప॥  రక్షకుడు - యేసు రక్షకుడు
        దక్షత కలిగిన - రక్షకుడు
       తక్షణమాయన - శరణు వేడిన
       అక్షయుడు - నిను రక్షించును ||2||

1.  బుద్ధి జ్ఞానముల కాధారుండు
    వృద్ధి క్షేమముల నొసగెడి ప్రభువు
    శ్రద్ధగ గాచె ప్రభువగు యేసు
    ప్రార్థనలను విని - ఫలము నొసగును ||2|| 
                                                 ॥రక్షకుడు॥

2. పాపరహితుడు ప్రభువగు యేసు
    పాపిని బ్రోవగ సిలువను మోసెను
    కృపజూపుచు మనకై మరణించెను
    శాపము బాపెను - దర్శన మొసగెను ||2||
                                                 ॥రక్షకుడు॥

Written by: Rev. Dr. T. Absalome

Submitted by: dani_karra on March 10, 2022

© Lyrics.com